మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'ఇండియా' కూటమితో పొత్తుకు ఏఐంఎంఐఎం సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంకేతాలిచ్చారు. ఎన్డీయేకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడదామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, ఎన్సీపీ-ఎస్పీ చీఫ్ శరద్ పవార్‌కు తమ పార్టీ లేఖ రాసినట్టు ఒవైసీ తెలిపారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లేనని అన్నారు. ''మేము కూడా మహారాష్ట్రలో షిండే-ఫడ్నవిస్ ప్రభుత్వం రావాలని కోరుకోవడం లేదు. దీనిపై నానా పటోలే, శరద్ పవార్‌కు మా పార్టీ మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ లేఖ రాశారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే. ఇంతకంటే మేము ఏమి చేయగలం?'' అని మీడియాతో మాట్లాడుతూ ఒవైసీ చెప్పారు.