మేక పాలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మేక పాలల్లో ప్రొటీన్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంకా రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.
జీవక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా డెంగ్యూ సోకిన వారికి రక్తంలో ప్లేట్ లేట్స్ తగ్గిపోతుంటాయి. ప్లేట్ లెట్స్ కౌంట్ని పెంచుకునేందుకు మేక పాలు మేలు చేస్తాయని సూచిస్తున్నారు.