వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్తేమి కాదని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తోందని మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. బాపట్ల జిల్లా ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో సోమవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున ప్రమాణస్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్సీ లేళ్లప్పిరెడ్డి, ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, నియోజకవర్గ ఇంచార్జీలు వరికుట్టి అశోక్ బాబు, ఈవూరి గణేష్, కరణం వెంకటేష్, హనుమారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.