ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సత్యకుమార్ కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అమిత్ షాతో మంత్రి భేటీ అవుతున్నారు. మూడు నెలల పాలన, చేపట్టిన కార్యక్రమాలు, అంతర్గతంగా ఉన్న వ్యవహారాలు, మూడు పార్టీల మధ్య సమన్వయం, కేంద్ర పథకాల అమలు వంటి అంశాలపై కేంద్ర హోంమంత్రికి సత్యకుమార్ నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ నేతలతో విడివిడిగా భేటీ కానున్నారు.