ప్రముఖ సీనియర్ నటి గౌతమికి అన్నాడీఎంకేలో కీలక పదవి దక్కింది. గౌతమి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి అన్నాడీఎంకేలో చేరారు. ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున ప్రచారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ ఉప ప్రచార కార్యదర్శిగా ఆమెను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి సోమవారం ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa