బీడీ, సిగార్ ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. మంగళవారం కడప సిఐటియు జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన ఏపీ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీడీ చట్టం, బీడీ కార్మిక సంక్షేమ చట్టం రద్దు చేయడం జరిగిందన్నారు.