ఏపీని మాజీ సీఎం జగన్ అంధకారంలో నెట్టివేశారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. పులివెందుల పట్టణంలో వీధిలైట్లు వెలగడం లేదని చెప్పారు.. ఈ విషయంపై పులివెందుల మున్సిపాలిటీ, విద్యుత్ అధికారులతో చర్చించారు. జగన్ ప్రభుత్వంలో రూ.27 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకు పోవడం వల్లే నేడు పులివెందుల అంధకారంలో ఉందని చెప్పారు.
పులివెందులను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని చెప్పిన జగన్ రెడ్డి అధ్వానంగా తయారుచేశారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. అభివృద్ది ఫేరుతో కోట్లు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని అంధకారంలోకి నెట్టేశారని అన్నారు. నేడు రూ.27 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. లైట్లు వెలగకపోవడం వల్ల కూటమి ప్రభుత్వం లైట్లు ఆపివేసిందని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. వారం రోజుల లోపుల లైట్లు వెలిగించాలనివిద్యుత్ అధికారులను ఆదేశించారు. లేనిపక్షంలో కూటమి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వద్ద ఆందోళన చేపడతామని రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు.