మెటాతో ఎంవోయూ ఒక చారిత్రాత్మకమైన మైలురాయి అని మంత్రి లోకేష్ అభివర్ణించారు. యువగళం పాదయాత్రలో విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ సర్టిఫికెట్ల కోసం పడుతున్న కష్టాలు ప్రత్యక్షంగా చూసి.. మొబైల్‌లోనే ఆయా సర్టిఫికెట్లు అందిస్తామని హామీ ఇచ్చానని చెప్పారు. తాను మాట ఇచ్చినట్టే ఈరోజు మెటాతో ఒప్పందం ద్వారా వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు, పౌరసేవలు పొందేలా మెటాతో ఒప్పందం చేసుకున్నామని... రానున్న రోజుల్లో మరిన్ని సేవలు ఆన్‌లైన్‌లో అతి సులువుగా, పారదర్శకంగా, త్వరగా పొందేలా ఏర్పాట్లు చేస్తామని ఐటీ మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.