వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. గుంటూరులోని జీజీహెచ్లో బ్రెయిన్ డెడ్ అయిన తెనాలి యువతి సహన కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు ఇవాళ(మంగళవారం) పరామర్శించారు. తెనాలిలో 2 రోజుల క్రితం ఒక యువకుడి చేతిలో అత్యాచారానికి గురైన సహనాని పరామర్శించామని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు.
వైసీపీ నేతలు ఈ విషయంపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు, మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరుకు రేపు రావడం అంటే నవ్వొస్తుందని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన దాడులు, హత్యలు జగన్ మరచిపోయారేమో అనిపిస్తోందని విమర్శించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు వైద్యులకు సూచించారని అన్నారు. సహనాకి అన్నిరకాల సహాయక వనరులు సత్వరమే అందిస్తామని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు భరోసా కల్పించారు.