బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పారాదీప్‌కు ఆగ్నేయంగా 700 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి దక్షిణ - ఆగ్నేయంగా 750 కిలోమీటర్లు, ఖేపుపరా కు ఆగ్నేయంగా 730 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా పయనించి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు (బుధవారం) తుఫానుగా మారే అవకాశం ఉంది. వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24వ తేదీకి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉంది. ఈనెల 24వ తేదీ రాత్రి లేదా 25వ తేదీ ఉదయం పూరీ , సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం. తుఫాను తీరం దాటే సమయంలో ఆ ప్రాంతంలో గంటకు పది నుంచి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి.
వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి. మత్య్సకారులు వేటకు వెళ్లారాదని వాతవారణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే చేపలు వేటకు వెళ్లిన మత్య్సకారులు తీరానికి చేరుకోవాలని సూచించింది. అలాగే రాష్ట్రంలో అన్ని పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉత్తరాంద్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.