డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ బీ ఎడ్ 2వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ బుధవారం ప్రకటించారు. అభ్యర్థులు నవంబర్ 4వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. రెగ్యులర్ అభ్యర్థులు రూ. 1335 చెల్లించాలి. పరీక్షలు నవంబర్ 19న ప్రారంభమవుతాయి.