ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గుర్లలో డయేరియా వ్యాప్తి చెందిందని, 5 నెలలుగా కనీసం నీటి క్లోరినేషన్ కూడా లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు గుర్ల గ్రామం, మండలంలో ప్రత్యేక పరిస్థితులు చూసి, గమనిస్తే, చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు కళ్లెదుటే కనిపిస్తాయి.
మా ప్రభుత్వ హయాంలో గ్రామ స్వరాజ్యం తీసుకొస్తే, ఆ గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలన్నీ సస్యశ్యామలంగా ఉంటే, ఈరోజు పరిస్థితి ఏమిటన్నది గమనించండి. డయేరియాతో అస్వస్థులై విజయనగరం జిల్లా గుర్లలో చికిత్స పొందుతున్న వారితో పాటు, డయేరియాతో చనిపోయిన వారి కుటుంబాలను మాజీ సీఎం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పరామర్శించారు.