రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల పరిధిలోని గ్రామాలలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న గృహాలు, పంటల వివరాలను వెంటనే తెలపాలని మండల డిప్యూటీ తహసీల్దార్ మాధవి లత కోరారు.
సోమవారం సిద్ధవటంలో ఆమె మాట్లాడుతూ.. తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన గృహ నిర్మాణదారులు గ్రామ సచివాలయంలో విఆర్ఓకు సమాచారం తెలపాలని కోరారు. పంట పొలాలు దెబ్బతిన్న వారు హార్టికల్చర్, అగ్రికల్చర్ వారికి తెలపాలన్నారు.