మహానేత వైయస్ఆర్ పేరును, రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన మంచిని శాశ్వతంగా ప్రజల మనసు నుంచి తీసేయాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు కుట్రలో షర్మిల భాగమయ్యారని, తండ్రికి తగ్గ నాయకుడిగా ఎదిగి నిద్ర లేకుండా చేస్తున్న వైయస్ జగన్‌ను నేరుగా ఎదుర్కోలేక షర్మిల అనే విషపు బాణాన్ని చంద్రబాబు ప్రయోగించారని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.
ఆదివారం తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో వైయస్ జగన్ వంటి వ్యక్తులు అరుదన్న ఆయన, మాటకు కట్టుబడి నిలబడే జగన్ లాంటి వ్యక్తి నాయకత్వంలో పని చేస్తున్నందుకు వైఎస్సార్ అభిమానులు గర్వపడుతున్నారని చెప్పారు. అధికారం కోసం అబద్ధపు హామీలు ఇవ్వరని, అందుకే వైయస్సార్ అభిమానులంతా జగన్‌నూ అభిమానిస్తున్నారని, అధికారం లేకపోయినా కోట్లాది మంది వెంట నడుస్తున్నారని తెలిపారు.