పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు బుధవారం డిమాండ్ చేశారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబావలి మాట్లాడుతూ జీవో నెంబర్ 77ను రద్దుచేసి పీజీ చదివే ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని, మెస్ కాస్మోటిక్ చార్జీలు రూ.3వేలకు పెంచాలని లేపాక్షి తాహసీల్దార్ కు వినతిపత్రాన్ని అందజేశారు.