ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన చర్చ మొదలైంది. జూన్ 12న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరింది. ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ప్రధానంగా కూటమి నేతలు ప్రచారం చేసారు. ఆ తరువాత రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పైన శ్వేత పత్రాలు విడుదల చేసారు.
జూన్ 12న అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు నెలల ఇరవై రోజుల కాలంలో కూటమి ప్రభుత్వం మొత్తంగా రూ 59 వేల కోట్ల అప్పు చేసింది.