అనంతపురంలోని శ్వేత ఈఎన్టి హాస్పిటల్ లో జ్వాలాపురానికి చెందిన ప్రముఖ ఈ.ఎన్.టి. వైద్యుడు డాక్టర్ శ్రీనాథ్ బుధవారం తెలుగుదేశం పార్టీలో శాశ్వత సభ్యత్వాన్ని స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన రూ.లక్ష చెల్లించి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం పడుతున్న కష్టానికి తన సహకారం అవసరమని భావించి పార్టీలో చేరినట్లు తెలిపారు.