శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ఏపీ హెచ్ బి కాలనీ నుంచి నాగావళి నది తీర ప్రాంతంలో రహదారి నిర్మాణానికి గాను చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు. బుధవారం ఆయన సుమారు రెండు కిలోమీటర్లు మేర ఆ ప్రాంతాన్ని నడుచుకుని వెళ్లి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ సమస్య తన దృష్టికి వచ్చిందని అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్, సంబంధిత కమిషనర్‌కు వివరాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు.