జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కొనసాగుతున్న పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పలాస పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సీఐ మోహనరావు మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని స్పష్టం చేశారు.