మన్యం జిల్లాలో కూడా ఆధార్ తరహాలో ఉండే అపార్ కార్డులను విద్యార్థులకు జారీచేయాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరిత గతిన పూర్తిచేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
ఈ ఒక్క అపార్ నంబర్‌తో విద్యార్థి చరిత్ర మొత్తం తెలిసిపోతుందని, విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కలెక్టర్ చెప్పారు.