ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబు బుధవారం సాయంత్రం పర్యటించారు.
ఈ సందర్భంగా కాలనీలో గత 14 సంవత్సరాల నుండి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ తాగునీటి సౌకర్యం సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వంతో చర్చించి సాధ్యమైనంత త్వరగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హరీష్ బాబు ప్రజలకు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa