ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబరు 1న ఈదుపురం సభలో పథకం ప్రారంభించనున్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 31, 2024, 10:25 PM

ఎన్నికల వేళ టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కూడా ఒకటి. ఈ పథకం అమలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు (నవంబరు 1) సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. చంద్రబాబు శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో పర్యటించనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభ ద్వారా ఆయన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడనున్నారు. అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.కాగా, ఉచిత గ్యాస్ కోసం రాష్ట్రంలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అర్హులైన వారికి ఉచిత గ్యాస్ ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇప్పుడు దీపం-2 పథకంలో భాగంగా ఉచిత సిలిండర్లను అందించనున్నారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పేదలపై గ్యాస్ భారం తగ్గుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను 4 నెలలకు ఒకటి చొప్పున పంపిణీ చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com