రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు అందజేస్తున్న ఎన్టీఆర్ భద్రతా పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం పొందూరు మండలం కింతలి పంచాయతీలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ప్రతినెల 1వ తేదీనే నేరుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.