ఏపీలో ఇసుక, మద్యం విషయంలో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. శనివారం అనకాపల్లి జిల్లాలో వెన్నెలపాలెంలో రహదారిపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉచిత ఇసుకలో ఎక్కడా రాజీ లేదని, దొంగతనంగా వ్యాపారం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. అక్రమాలపై పీడీ యాక్ట్ పెడతామని స్పష్టం చేశారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.