దివంగత మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రం నాయుడు ప్రజా హృదయ నేత అని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి, ఓల్డ్ ఎంపీ ఆఫీసు, పెద్దపాడు.
సింగపురంలో ఎర్రం నాయుడు 12వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి శనివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పనిచేసిన మహానేత ఎర్రం నాయుడని కొనియాడారు.