వరదల్లో ముంపులో చిక్కుకున్న ఇంటిని జాకీల సాయంతో కదిలించారు. కలెక్టర్ ఆదేశాలతో యజమానికి నోటీసులు జారీ చేయగా.. ఆ ఇంటిని కూల్చడానికి ఇష్టంలేక జాకీల సాయంతో జరుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలంలో వరదల సమయంలో పలు ప్రాంతాలు ముంపులో ఉన్నాయి. దీంతో రాజమహేంద్రవరం రూరల్ మండలంలో ఆవకాలువ ఆక్రమణలు తొలగించాలని అధికారులను కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు.
వెంటనే హుకుంపేట సిద్దార్థ స్కూల్ యజమాని మూర్తి ఇంటి కి పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తనకు నెల రోజులు సమయం కావాలని ఈ సమయంలో తాను భవనాన్ని తొలగించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ భవనాన్ని కూల్చేందుకు మూర్తి ఇష్టపడలేదు.. దానిని ముందుకు జరిపేందుకు ఏకంగా రూ.70 లక్షలు ఖర్చు చేస్తున్నారు.
ఈ ఇంటిని రాజమహేంద్రవరం గ్రామీణం హుకుంపేట పంచాయతీ పరిధిలో నేషనల్ హైవేకు దగ్గర.. 100 అడుగుల పొడవు 34 అడుగుల వెడల్పుతో 35 ఏళ్ల క్రితం ఈ భవనాన్ని నిర్మించారు. జాకీల సహాయంతో ఈ భవనాన్ని కొద్దికొద్దిగా పైకి లేపి ముందుకు జరుపుతున్నారు. ఈ ప్రక్రియ కోసం బీహార్ నుంచి నైపుణ్యం కలిగిన 40 మంది కార్మికులను తీసుకొచ్చారు. వీరంతా భవనాన్ని ముందుకు జరిపేందుకు మూడు నెలల సమయం పడుతుందని భవన యజమాని మూర్తి అంటున్నారు. స్టక్చరల్ ఇంజనీరుని సంప్రదించి ఈ పనులు మొదలుపెట్టినట్లు తెలిపారు.
గుంతల రోడ్లతో గత అయిదేళ్లూ నరకం చూసిన ప్రజలకు వాటి నుంచి విముక్తి కలిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద శనివారం జిల్లాలో మరమ్మతుల పనులు చేపట్టనున్నారు. జిల్లాలో 145 కి.మీ. మేర ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులకు రూ.10.29 కోట్లు వెచ్చించనున్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పనులు ఆరంభిస్తారు.
జిల్లా పరిధిలో 1,300 కి.మీ మేర ఆర్‌అండ్‌బీ రహదారులు ఉండగా, వీటిలో 1,070 కి.మీ మరమ్మతులకు గురయ్యాయని ఎస్‌ఈ జి.కంఠు తెలిపారు. వీటిలో ప్రస్తుతం 145 కి.మీ మేర రూ.10.29 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వీటిలో టెండర్లు పూర్తయిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు.