ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. నవంబరు 11 నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, జూన్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు. ఓటాన్ అకౌంట్ తోనే ప్రభుత్వం నెట్టుకొస్తున్నది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుండగా..పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెతతాల్సిన అవసరం ఏర్పడింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే అంటే 11నే ఈ బడ్జెట్ ఉంటుంది. ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనుంది. కనీసం పదిరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.బడ్జెట్ తోపాటు ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం.