ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి 2025 మార్చిలో జరిగే ఎన్నికల్లో పిడిఎఫ్ తరపున ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావును గెలిపించాలని పలు సంఘాల నాయకులు కోరారు. ఆదివారం అరండల్పేటలోని గీతా రీజెన్సీలో లక్ష్మణరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.