వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటే మూఢ నమ్మకం కాదు, ప్రజలకు సేవలు చేస్తూ, దళిత గోవిందం, సోషలిస్టు భావజాలం ప్రజలకు తీసుకువెళ్ళిన నాయకుడు భూమన కరుణాకరరెడ్డి. తిరుపతి నగరం గత ఐదేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది.
భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలల్లో ఎన్నో దారుణాలు జరిగాయి. 2027 చివరిలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విజయం సాధిస్తాం. ఆ ఎన్నికల్లో భూమన కరుణాకరరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.