ప్రముఖ పత్రిక విలేఖరి హత్య కేసులో వైసీపీ నేతకు హైకోర్టు షాకిచ్చింది. ఈ హత్య కేసులో వైసీపీ తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈరోజు (మంగళవారం) బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. కాగా... 2020లో తుని రూరల్ విలేఖరి కే సత్యనారాయణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
ఈ హత్యలో మాజీ ఎమ్మెల్యే దాడిసెట్టి రాజా ప్రమేయం ఉందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేపై కేసు లేకుండా చేశారు పోలీసులు. దీనిపై న్యాయవాది అయిన సత్యనారాయణ సోదరుడు.. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రాజా ప్రమేయం ఉందని కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్‌లో రాజా పిటిషన్ వేశారు.