కంచిలి మండలం జాడపూడి కాలనీ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో కారు అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం సోంపేట ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa