విద్యుత్ సర్దుబాటు ఛార్జీలపై ప్రొద్దుటూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో మొదలైన ట్రూ అప్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందన్నారు. ఈ ఐదు నెలల పాలనలోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని, ఇది హై ఓల్టేజీ షాక్ కాకపోతే ఏమిటని నిలదీశారు. అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు.