అనకాపల్లి రైల్వే స్టేషన్ లో శుక్రవారం రాత్రి జన్మభూమి ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తూ రావికమతం మండలం తోటకూరపాలెంకి చెందిన పైల రాజబాబు ప్లాట్ఫారంకి ట్రైన్ కి మధ్య కాలు ఇరుక్కొని నరకయాతన అనుభవించాడు.
రైల్వే సిబ్బంది 40 నిమిషాల పాటు శ్రమించి గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఇతడు విశాఖ కేజిహెచ్ లో చికిత్స పొందుతున్నాడు.