ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమిలో నామినేటెడ్‌ పదవులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 10, 2024, 01:56 PM

టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటూ కష్టపడి పనిచేసిన వారిని, ఇన్‌చార్జిలుగా ఉంటూ సీట్లు త్యాగం చేసిన వారిని నామినేటెడ్‌ పదవులు వరించాయి. అలాగే మిత్రపక్షాలు జనసేన, బీజేపీకి సముచిత ప్రాధాన్యం దక్కింది. శనివారం కూటమి ప్రభుత్వం రెండో విడతలో మొత్తం 59 సామాజిక వర్గాల సంక్షేమ కార్పొరేషన్లు, అభివృద్ధి సంస్థలకు చైర్మన్లను నియమించింది. టీడీపీ మిత్రపక్షాలు జనసేనకు 10, బీజేపీకి 3 నామినేటెడ్‌ పదవులు దక్కాయి. రాజకీయాలకు అతీతంగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే సలహాదారు పదవిలో కేబినెట్‌ ర్యాంక్‌తో నియమించారు.


గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయనకు సాంస్కృతిక సలహాదారుడి పదవి ఇచ్చినా సున్నితంగా తిరస్కరించారు. శాసనమండలి మాజీ చైర్మన్‌ షరీ్‌ఫకు ముస్లిం మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా కేబినెట్‌ ర్యాంక్‌తో నియమించారు. 3 రాజధానుల బిల్లును ఆమోదించాలంటూ గత ప్రభు త్వం ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా, మంత్రులు వ్యక్తిగత దూషణలకు దిగినా విధి నిర్వహణలో ఆయన నిక్కచ్చిగా వ్యవహరించారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి బీసీలు, వివిధ సామాజిక వర్గాలు, సీనియర్లు, యువతకు ఈ జాబితా లో స్థానం దక్కింది. బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న వీరంకి గురుమూర్తిని ఏపీ గౌడ సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిలో నియమించారు. టీడీపీ నాయకురాలు మంజులారెడ్డికి శిల్పారామం, ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ సాంస్కృతిక సొసైటీ చైర్‌పర్సన్‌ పదవి దక్కింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల పోలింగ్‌ బూత్‌కు ఏజెంట్‌గా వెళ్తున్న మంజులారెడ్డిని పిన్నెల్లి ముఠా దారికాచి కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి నా ఆమె తలకు కట్టు కట్టుకుని మరీ పార్టీ కోసం పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పలుమార్లు భౌతికదాడులను ఎదుర్కొని పార్టీకి పనిచేసిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులను ఏకం చేసి పోరాడిన పొడపాటి తేజస్వినికి నామినేటెడ్‌ పదవులు దక్కాయి. పార్టీ అధినేత వాహనశ్రేణికి పైలట్‌గా స్కూటర్‌పై వేల కిలోమీటర్లు ప్రయాణించిన దివ్యాంగుడు గోనుగుంట్ల కోటేశ్వరరావుకు నామినేటెడ్‌ పదవి లభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com