పలాస మండలం నెమలి నారాయణపురం సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. గవరయ్య అనే వీఆర్వో విధుల నిమిత్తం హరిపురం వైపు బైక్ పై వెళ్తుండగా ఒక్కసారిగా బైక్ స్కిడ్ అయి క్రింద పడ్డారు.
ఆ సమయంలో భారీ వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa