ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా స్థానిక వైసీపీ నాయకుడు చింతాడ రవికుమార్ ను పార్టీ అధిష్టానం సోమవారం నియమించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు చింతాడ రవికుమార్ మంగళవారం ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్, శ్రీకాకుళం పార్లమెంటరీ ఇన్చార్జ్ తమ్మినేని సీతారాంను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి చేస్తామని చింతాడ అన్నారు.