సినిమా సీరియస్‌గా నడుస్తున్నప్పుడు డైవర్షన్ కోసం ఒక కమెడియన్ వస్తాడు.. అచ్చం అలాగే ఇప్పుడు టీడీపీ ఆఫీసులో ఆనం వెంకటరమణారెడ్డి అనే ఓ కమెడియన్ ప్రత్యక్షమయ్యాడు. విచక్షణ లేకుండా మాట్లాడుతున్నాడు అంటూ వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. ఆనం ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తామూ మాట్లాడగలమని ఆయన హెచ్చరించారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ అధినేతను ఏకవచనంతో సంబోధిస్తున్న ఆనం వైఖరిని తీవ్రంగా తప్పు పట్టిన, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, అలా తామూ మాట్లాడగలమని, అయితే తమకు సంస్కారం ఉందని చెప్పారు.
ఆనాడు చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చిన ఎన్టీఆర్ మాటలు ప్రస్తావించిన ఆయన, త్వరలో తన తండ్రి చంద్రబాబును కూడా నారా లోకేశ్ ఔరంగజేబు మాదిరిగా పక్కకు నెట్టి సీఎం కుర్చీ లాక్కుంటాడని బయట జోరుగా ప్రచారం జరుగుతోందని గుర్తు చేశారు. ఇకనైనా ఆనం తన నోరు అదుపులో పెట్టుకోవాలని, మళ్లీ తమ నాయకులపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తామని శివశంకర్‌రెడ్డి హెచ్చరించారు. వైయస్ జగన్‌గారిపై పిచ్చికూతలు కూస్తున్న నల్ల బాలు అనబడే ఆనం వెంకటరమణారెడ్డి, ఆ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న హీరో ఇంట్లో కాల్పులు జరిగితే, వైద్యుల నుంచి ఏ సర్టిఫికెట్ తీసుకుని, బెయిల్ పొందారో గుర్తు చేసుకోవాలని కోరారు. ధైర్యం ఉంటే తాను చెప్పింది వాస్తవమో, కాదో చెప్పాలని కోరారు. అలాగే చంద్రబాబు సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడికి మెంటల్ అని చెప్పి గొలుసులతో కట్టేసిన విషయాన్ని ఆయన బంధువు నార్నె శ్రీనివాసరావు మీడియా ముందు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలా? వద్దా? అనేది తమ పార్టీ శాసనసభాపక్షం నిర్ణయిస్తుందన్న పుత్తా, దీన్ని ప్రశ్నించడానికి ఆనంకు ఏ హక్కు ఉందని నిలదీశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటూ, ఏసీ టికెట్లు, ఇంటర్నెట్, కరెంట్ బిల్లులు ఉచితంగా పొందుతున్నారని ఆరోపిస్తున్న ఆనం.. నవంబర్ 19, 2021 నుంచి కారణం లేకుండా రెండున్నరేళ్లు చంద్రబాబు అసెంబ్లీకి ఎందుకు రాలేదని, అలాగే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సైతం ఆగస్టు 13, 1993న అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిన విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. మరి వారు ఉచితంగా జీతాలు తీసుకున్నట్లు కాదా? అని పుత్తా శివశంకర్‌రెడ్డి నిలదీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa