ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని మరింత పెంచి ఏలూరు జిల్లాను హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని కలెక్టర్ కె.వెట్రిసెల్వీ అన్నారు. ఈ మేరకు అధికారులు రైతుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. పెదవేగి మండలంలో ఉద్యానవన పంటలను కలెక్టర్ మంగళవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. దిబ్బగూడెంలో ఆయిల్‌పామ్, కొబ్బ రి, కోకో, మిరియం, పసుపు, ఆవకాడో పంటలు, గార్లమడుగులో అరటితోటలో బిందుసేద్యం, పెదవేగిలో ఏపీ ఆయిల్‌ఫెడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఆయిల్ పామ్‌లో అంతర పంట కోకో, లక్ష్మీపురంలో కొబ్బరి తోటలో దాల్చినచెక్క, యాలకులు, వక్క, జాజికాయ, లిచీ పంటలను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఉద్యానశాఖ డీడీ ఆర్.రామ్మోహన్, మైక్రో ఇరిగేషన్ పీడీ పి.రవికుమార్, తహ సీల్దారు ఎస్‌డీ.భ్రమరాంబ, ఉద్యానశాఖాధికారి కె.రత్నమాల పాల్గొన్నారు.