పార్వతీపురం జిల్లాలోని హైరి స్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి.కరుణ అన్నారు. జిల్లాలోని రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవా రం పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రితో పాటు బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంసీహెచ్, ట్రైబుల్ సెల్లో రోగుల వివరాల రికార్డును పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు బాగున్నాయని, మరింత మెరు గైన వైద్యం అందించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. డీఎంహెచ్వో విజయపార్వతి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వాగ్దేవి, వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అఽధికారి డా.వినోద్ పాల్గొన్నారు.