విజయనగరం జిల్లా, కొమరాడ మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. రాత్రి వేళల్లో కుమ్మరిగుంట, కంబవలస, కందివలస, తదితర గ్రామాల్లోని పంట పొలాల్లో ఏనుగులు సంచారించాయి. ఈ సమయంలో కంబవలసకు చెందిన గొర్లి సంగీతకు చెందిన మొక్కజొన్న గింజలను తొక్కిపెట్టి మట్టిలో కలిపేశాయి. సుమారు 50 బస్తాలకు పైగా మొక్కజొన్న గింజలు పాడైనట్లు బాధిత రైతు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులు ఈ ప్రాంతం నుంచి తరలించాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa