ఇరాన్, ఇజ్రాయెల్ -అమెరికా సంయుక్త యుద్ధ నేపథ్యంలో దుబాయ్ నగరం శుక్రవారం భారీ పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది. నగరం మధ్య భాగంలో పెద్ద ఎత్తున పొగ కమ్ముకోవడంతో పాటు పలు భవనాలు కంపించాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.నగరంలోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిని గాల్లోనే విజయవంతంగా అడ్డుకున్నామని, దాని శకలాలు ఒక భవనం వెలుపలి భాగంపై పడటంతో స్వల్ప నష్టం వాటిల్లిందని దుబాయ్ మీడియా కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఒక భవనంపై శకలాలు పడినట్లు తాము కూడా భావిస్తున్నామని, పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని ఏఎఫ్పీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa