సోషల్ మీడియా ప్రభావంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విచ్చలవిడిగా లభిస్తున్న అసభ్యకరమైన మరియు అశ్లీల సమాచారం యువతను, ముఖ్యంగా 12 ఏళ్ల ప్రాయంలో ఉన్న చిన్నారులను తప్పుదోవ పట్టిస్తోందని మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ ఆందోళన వ్యక్తపరిచారు. ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై కేవలం ఒక్క క్లిక్‌తో ఇలాంటి కంటెంట్ అందుబాటులోకి రావడం వల్ల సామాజికంగా తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన అన్నారు.యుక్తవయసులోనే చిన్నారులు ఇటువంటి కంటెంట్‌కు బానిస అవ్వడం వల్ల మహిళల పట్ల వారిలో గౌరవం తగ్గుతుందని, ఇది దీర్ఘకాలంలో వారి ప్రవర్తనలో ప్రతికూలతకు, మానసిక సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఇలాంటి అనుచిత కంటెంట్ సర్క్యులేట్ అవ్వడం వల్ల సమాజానికి ఎటువంటి లబ్ధి చేకూరదని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కఠినమైన ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని హర్భజన్ సింగ్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa