ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయ్ పేలుళ్ల శబ్దాలు

international |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 03:00 PM

ఇరాన్, ఇజ్రాయెల్ -అమెరికా సంయుక్త యుద్ధ నేపథ్యంలో దుబాయ్ నగరం శుక్రవారం భారీ పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది. నగరం మధ్య భాగంలో పెద్ద ఎత్తున పొగ కమ్ముకోవడంతో పాటు పలు భవనాలు కంపించాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.నగరంలోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్  వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిని గాల్లోనే విజయవంతంగా అడ్డుకున్నామని, దాని శకలాలు ఒక భవనం వెలుపలి భాగంపై పడటంతో స్వల్ప నష్టం వాటిల్లిందని దుబాయ్ మీడియా కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఒక భవనంపై శకలాలు పడినట్లు తాము కూడా భావిస్తున్నామని, పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని ఏఎఫ్‌పీ ప్రతినిధి ఒకరు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa