ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్‌ వలతో లక్షల్లో సొమ్ము కాజేసిన దుండగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 08:30 PM

సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి ఒక వ్యక్తి 46 లక్షల 30 వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఏలూరు , అశోక్‌నగర్‌కు చెందిన కె.శేషగిరి ప్రసాద్‌కు ఈ నెల 8వ తేదీన ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆయన అకౌంట్‌కు 20 వేల రూపాయలను పంపించారు. పొరపాటున వచ్చాయని తిరిగి వాటిని వేయాలని ప్రాధే యపడి అడిగాడు. ఆ మాటలు నమ్మిన శేషగిరి ప్రసాద్‌ తిరిగి ఆన్‌లైన్‌ ద్వారా పంపించారు. ఈ నెల 10న తన అకౌంట్‌ను పరిశీలించగా 46 లక్షల 30 వేల రూపాయలను సైబర్‌ నేరగాళ్లు అపహరించారని గుర్తించా రు. ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టూటౌన్‌ సీఐ వైవి రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్‌ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com