ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమపై అంత చులకన భావం ఎందుకు చంద్రబాబు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2024, 06:56 PM

చంద్రబాబు పాలనలో రాయలసీమకు అంతులేని అన్యాయం జరుగుతుందని వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్ సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కూటమి నేతలు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు.  కర్నూలు కేంద్రంగా పని చేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం నిర్ణయంపై రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు సీమలో పెట్టాలన్నారు.. కానీ పెట్టలేదు. అందరూ విస్మరించినా దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైయ‌స్ఆర్ సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు.


హైకోర్టు కోసం బార్ కౌన్సిల్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో హెచ్ఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు కర్నూలులో ఏర్పాటైంది. అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వైయ‌స్ జగన్ మూడు రాజధానుల పేరుతో కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించారు. రెండవ లా యూనివర్సిటీని కూడా కర్నూలులో పెట్టాలని నిర్ణయించారు.  ఇందుకోసం భూమి, 100 కోట్ల నిధులు కూడా కేటాయించారు. దాన్ని కూడా చంద్రబాబు తరలించుకుపోయారు అని ఆవేదన వ్యక్తపరిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com