రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు విజయనగరం జిల్లా కేంద్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న పెనుమజ్జి అనిల్ కుమార్ (30) ఈ నెల 17న అయ్యన్నపేట జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్ బలంగా ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయమైంది. జిల్లా కేంద్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa