ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. సభ మొదలవగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. 2019-24 మధ్య రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు పెరిగాయన్నారు. వీటిని అరికట్టడానికి స్పెషల్‌గా ఓ టాస్క్ పోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరిని గుర్తించి ప్రోవైలింగ్ చేస్తున్నామని.. అనుమానిత, పాడుపడ్డ ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేశామని చెప్పారు. గంజాయికి సంబంధిచి ఐదేళ్లు బాగా విస్తృతం అయ్యిందన్నారు. దీని నివారణకు అడిషనల్ డీజీ స్ధాయి అధికారిని నియమించి క్యాబినెట్ ఆమోదం తీసుకున్నామని హోంమంత్రి అనిత తెలిపారు.