టెక్కలి పట్టణంలో జనసేన పార్టీ ఇంచార్జ్ కనితి కిరణ్ కుమార్ ను బుధవారం రాష్ట్ర కళింగ సంక్షేమ సేవా సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాజకీయాలలో కళింగ కమ్యూనిటీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా జనసేన అధిష్టానం వద్ద తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ అధ్యక్షులు వెంకటరమణ, గౌరవ అధ్యక్షుడు రామచంద్రరావు, ఉత్తరాంధ్ర యూత్ ఇంచార్జ్ అన్నెపు సంతోష్, రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.