సకాలంలో రుణాలు , క్లైమ్ ల పరిష్కారానికి చొరవ చూపాలని ఏపిజిఎల్ఐ రాష్ట్ర సంచాలకులు రెడ్డి శ్రీనివాస్ అన్నారు.వారి పర్యటనలో భాగంగా గురువారం శ్రీకాకుళం చేరుకున్న సంచాలకులు శ్రీకాకుళం ఏపిజిఎల్ఐ కార్యాలయంకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు.
సిబ్బంది హాజరుకు సంబంధించి ఎఫ్ ఆర్ ఎస్, హాజరు పట్టి, ఇతర రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్త పరిచారు. ఈపిజిఎల్ సేవలు పట్ల అందరికీ అవగాహన కల్పించాలన్నారు.