ఈనెల 27 నుంచి 30 వరకు విజయనగరంలో జరిగే ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు బి బాబ్జి కోరారు. శుక్రవారం యలమంచిలి ప్రభుత్వ బీసీ కళాశాల వసతి గృహంలో ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ అయన ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో చాలా విద్యాసంస్థలు మూతబడడం జరిగిందని తక్షణమే జాతీయ నూతన విద్యా విధానం రద్దు చేయాలన్నారు.